Blog

డేటామెయిల్‌ నుంచి ‘డేటారేడియో’

40

ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్‌ ఐడీ సేవలు అందించే డేటామెయిల్‌ సంస్థ తాజాగా వాయిస్‌ ఆధారిత సోషల్‌ మీడియా మెసేజింగ్‌ ఫీచర్‌ డేటారేడియోను ప్రవేశపెట్టింది. విపరీత కామెంట్లు, ఆన్‌లైన్‌ వేధింపులు మొదలైన వాటి గురించి భయపడనక్కర్లేకుండా యూజర్లు తమ ఫాలోయర్లకు ఆడియో సందేశాలను ప్రసారం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

డేటామెయిల్‌ యూజర్లు.. తమ పేర్లతో తమకంటూ ఓ రేడియో చానల్‌ రూపొందించుకోవచ్చని, దాని గురించి తెలిసిన వారు సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవచ్చని డేటా ఎక్స్‌జెన్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపక సీఈవో అజయ్‌ డేటా తెలిపారు.

← All posts